ఉపాధ్యాయ సేవలకు గౌరవం
- కడెం దాసు సేవలు ఆదర్శప్రాయం
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 22(విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన కడెం దాసు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడు తూ, ఒక మంచి ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పి.
కడెం దాసు తన 36 సంవత్సరాల సేవా కాలంలో ఎన్నో తరాలను విద్యా బుద్ధులతో తీర్చిదిద్దారని, గ్రామీణ ప్రాంతం లో విద్యా అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు అని కొనియాడా రు. 36 సంవత్సరాల పాటు నిరంతర సేవలందించి, విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన దాసుని ఘనంగా సన్మానించడం ఎంతో సంతోషకరమని తెలిపారు.
విద్యారంగంలో సేవ చేసిన వారికి సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి సేవలను ఎల్లప్పుడూ గౌరవించాలని మల్లన్న పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమని నాగరాజు, గ్రా మస్తులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉ పాధ్యాయులు, నాయకులు కడెం దాసుని ఘనంగా సన్మానించారు.






