8 August, 2026 | 2:32 AM

ర్యాగింగ్ పై అవగాహన

08-08-2026 01:19 AM

మణుగూరు(టౌన్ ), ఆగష్టు 7,( విజయక్రాంతి ):-  మున్సిపాలిటీ పరిధిలోని మణుగూరు ఎస్డిపిఓ కార్యాలయంలో ర్యాగింగ్ నిర్మూలనపై డి.ఎస్.పి రవీందర్ రెడ్డి శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,, ప్రతి విద్యా సంస్థలు పేరెంట్స్ కమిటీ, ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని రాగింగ్ అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యా సంస్థలలో డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏవైనా వాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మహమ్మద్ రవుఫ్, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.