కేటీఆర్‌తో ఆస్ట్రేలియా హై కమిషనర్ భేటీ
పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై చర్చ
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భారతదే శంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్స ల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీతో గురువారం సమావేశమయ్యారు. నందినగర్‌లో జరిగిన ఈ భేటీలో పరస్పర ప్రయోజనాలు, వ్యూహాత్మక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, విద్యారంగంలో నూతన భాగస్వామ్యాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. గతంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కేటీఆర్ అనేక అంశాలపై చర్చించారు.
ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిపై తెలంగాణ ఆస్ట్రేలియా మధ్య సహకారం భవిష్యత్తులో స్థానిక యువతకు మరిన్ని అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మన రాజకీయం సరైన దారిలోనే ఉందని అర్థం : కేటీఆర్
ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీ లు ఒకేసారి నాపై అసహనం వ్యక్తం చేస్తే మనం చేస్తున్న రాజకీయమే సరైన దారిలో ఉందని అర్థం చేసుకోవాలేమో! అంటూ కేటీఆర్ గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రస్తు తం తెలంగాణ రాజకీయాల్లో మూడు ప్రధాన పార్టీల నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్, బీజేపీతో పాటు ఎంఐఎం కూడా బీఆర్‌ఎస్‌పై దాడి పెంచుతున్న తరుణంలో అందరికీ టార్గెట్ అవుతున్నామంటే ప్రజల్లో ఇంకా మా ప్రభావం ఉందనే సంకేతం అనే సందేశాన్ని వెల్లడించారు.






