ఈ నెల 25న సీజ్ చేసిన ఇసుక వేలం
19-08-2026 07:15 PM
పాపన్నపేట: మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఈ నెల 25న బహిరంగ వేలం నిర్వహిస్తామని తహశీల్దార్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని 154 ట్రిప్పుల అక్రమ ఇసుకను గత నెల 21న రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు కలిసి దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఈ వేలం మండల పరిషత్ కార్యాలయ హల్ లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.






