22 June, 2026 | 3:01 AM

గాంధీ పేరిట విధ్వంసం

22-06-2026 01:58 AM
  1. మహాత్ముడి ఆత్మ కూడా ఘోషిస్తుంది
  2. సీఎం రేవంత్‌రెడ్డి నమ్మేది గాడ్సేను..
  3. గాంధీ విగ్రహం పెడతానని దొంగ మాటలు
  4. గాంధీపై ప్రేమ ఉంటే పేదల ఇండ్లు కూల్చొద్దు
  5. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు బీజేపీ కూడా మద్దతు 
  6. ‘చోటే భాయ్.. బడే భాయ్’ ఇద్దరూ కలిసి మూసీ భూములు లూటీ 
  7. రాజేంద్రనగర్ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్/శంషాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): గాంధీ మహాత్ముడి పేరుతో సీఎం రేవంత్ చేస్తున్న మూసీ విధ్వంసాన్ని చూస్తే మహాత్ముడి ఆత్మ కూడా ఘోషిస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తన కమీషన్ల కోసం, కాసుల కోసం వేల మంది పేద మధ్యతరగతి ఇండ్లను కూల్చేందుకు రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రను స్వయంగా మహాత్మా గాంధీ మనుమడు తుషార్ గాంధీ కూడా వ్యతిరేకించారని కేటీఆర్ చెప్పారు. అయినా వినకుండా పేద ప్రజలపైన రేవంత్‌రెడ్డి తన కుట్రలు కొనసాగి స్తున్నారని అన్నారు.

గాంధీ మహాత్ముడి విగ్రహం పెడతానంటూ పేదల ఇండ్లు కూలుస్తున్న రేవంత్‌రెడ్డి పైన కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నమ్మేది గాడ్సేను అయినా మహాత్మా గాంధీ విగ్ర హం పెడతానని దొంగ మాటలు చెప్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ పైన నిజంగానే ప్రేమ ఉంటే ప్రజ ల ఇండ్లు కూల్చకుండా ఆయన విగ్రహం కట్టాలని కేటీఆర్ సూచించారు. చివరికి చిన్న పిల్లలు సైతం ‘మా ఇండ్లు కూలగొట్టవద్దు.. కిడ్డీ బ్యాంక్ డబ్బులైనా ఇస్తాం. మమ్మల్ని వదిలిపెట్టండి’ అని వేడుకుం టే కూడా రేవంత్ మనసు కరగపోగా, దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మూసీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసపు రాజకీయాలకు బీజేపీ కూడా మద్ద తు ఇస్తున్నదని ఆరోపించారు. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ దగ్గర మాట్లాడుకొని ‘చోటే బాయ్.. బడే బాయ్’ ఇద్దరు కలిసి మూసీ భూములను కొల్లగొడుతున్నారని విమర్శించారు. నిజంగానే మోదీకి నిజాయతీ ఉంటే పేద ప్రజల భూములు లాక్కోవద్దు, పేద ప్రజలకు అన్యాయం చేయవద్దు అంటూ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

ఒకవైపు స్థానికంగా బీజేపీ నేతలు పెద్దపెద్ద మాట లు మాట్లాడుతారు.. ఈటల రాజేందర్, కిషన్‌రెడ్డి వచ్చి మూసీ ప్రజలను మోసం చేస్తున్నారని, కానీ వారి సొంత పార్టీ సొంత ప్రభుత్వం మాత్రం ఇండ్లు కూలగొట్టమని అనుమతులు ఇస్తుందన్నారు. గరీబోల ఇం డ్లు కూలగొట్టమని ఇటు రేవంత్‌రెడ్డి, అటు మోదీ దుర్మార్గమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం సీటు రెన్యువల్ కోసమే.. ఢిల్లీకి డబ్బుల సంచులు

కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు దాటినా.. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చేందుకు డబ్బులు లేవని చెబుతున్న రేవంత్‌రెడ్డి మూసీలో మాత్రం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. కేవలం ప్రతి దాంట్లోంచి కమీషన్లు తీసి ఢిల్లీలోని రాహుల్ గాంధీకి ప్రతి నెల పంపడం కోసమే ఇన్ని అరాచకాలు రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నెలా రాహుల్ గాంధీ దగ్గరకు రేవంత్‌రెడ్డి సం చుల కట్టలు పంపి, రెన్యువల్ చేసుకోకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుందని ఎద్దేవా చేశారు.

మూసీలో ఖర్చు పెడుతున్న లక్షన్నర కోట్లతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సినిమా సగం అయిపోయిం దని అది పూర్తి అట్టర్ ఫ్లాప్ సినిమా అన్నారు. ఇప్పుడు నడుస్తున్న రేవంత్‌రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అని అందరికీ తెలిసిపోయింద న్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతారా అని ప్రజలు వెయిట్ చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలన్న ఏకైక ఆలోచన ప్రజల్లో ఉన్నదన్నారు.

ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం లేదని కేవలం ఒక మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. ‘అందినంత దోచుకో.. దొరికిన కాడికి దాచుకో’ అనే స్కీ ము నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్‌కి రేవంత్‌రెడ్డి గుంపు మేస్త్రీగా ఉన్నారని, అందుకే అటు రేవంత్‌రెడ్డితో పాటు ప్రతి మంత్రి, కాంగ్రెస్ నాయ కులు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. సామాన్యుల భూములు లాక్కొని గుండాయిజం చేసే రేవంత్ రెడ్డిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొడుకు గుండాయిజాన్ని ప్రతి ఒక్కరూ చూ శారని చెప్పారు.

కాంగ్రెస్ కనుసన్నల్లోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్‌లో 180 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూ మిని ప్రైవేట్ వారికి రాసిచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. స్వయం గా ముఖ్యమంత్రే ప్రతి ఒక్కరినీ బెదిరిస్తూ మంత్రులు పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెడుతూ డబ్బులు ఇస్తారా చస్తారా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు.

ఎంతమంది పోయినా బలంగానే గులాబీ సైన్యం

రెండున్నర సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్ పార్టీ వేలాది ఇండ్లను కూల్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఉన్న సిటీని వదిలిపెట్టి కేవలం తాను కబ్జా చేసిన వేలాది ఎకరాలను కాపాడుకోవడం కోసమే ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. కేవలం తన భూము లు చూసుకోవడానికే ఉనికిలో లేని ఫ్యూచర్ సిటీకి అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో పార్టీ మారాను అని అన్నారు. కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో చేసిన ఒక్క అభివృద్ధి పని అయినా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎంతమంది పెద్దనేతలు పోయి నా గులాబీ సైన్యం బలంగా అలాగే ఉన్నదన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ని తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి గులా బీ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్‌ఐఆర్‌పైన కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం రాగానే అందరికీ పట్టాలు హనుమాన్ నగర్ ప్రజలకు అండగా బస్తీబాటలో కేటీఆర్

ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి.. రాబోయేది మన ప్రభుత్వమే.. కేసీఆర్ ప్రభుత్వమే.. మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోవాలని, కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దు అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్‌లో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో కేటీఆర్ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న ప్రజలు తమను బలవంతంగా తరలించి, ఆ భూములను ప్రభుత్వం విక్రయించేందుకు ప్రయత్నిస్తోం దని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేసిన పట్టాలను కూడా రద్దు చేసి, తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారం లో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదని గుర్తు చేశారు.

హనుమాన్‌నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ప్రజలను భయభ్రాంతు లకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు లేవని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పెద్దలకు ఒక నీతి, సామాన్యులకు మరో నీతి అన్నట్లుగా వ్యవహరి స్తోందని కేటీఆర్ ఆరోపించారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరిం పులకు గురిచేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బస్తీవాసులు పాల్గొన్నారు.