22 June, 2026 | 4:22 AM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

22-06-2026 12:06 AM

గజ్వేల్, జూన్ 21: గజ్వేల్ పతంజలి యోగ సమితి అధ్వర్యంలో స్థానిక బాలుర ఎస్సీ మరి యు బిసి బాలుర హాస్టల్ లో అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆకుల నరేశ్ హాజరై మాట్లాడుతూ పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన గొప్ప వరం యోగ శాస్త్రం అనీ, ప్రతి నిత్యం యోగ అభ్యాసం ద్వారా మనిషి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాడన్నారు.

బాల యోగ సాధకుడు కడారి అఖిలేష్, చిలివేరి జనార్దన్ ప్రదర్షించిన కఠిన ఆసనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పతంజలి యోగ సమితి సభ్యులు రంగాచారి, కడారి నరేంద్ర, మనీష,  చిలివేరి జనార్దన్, గడ్డమీది నాగభూషణం, దొంతుల ఆనంద్, కుడిక్యాల రాములు, బలరాం,వుప్పల మధుసూదన్, హిస్టల్ వార్డెన్స్ పోశాద్రి, కనకయ్య  తదితరులు పాల్గొన్నారు.