22 June, 2026 | 2:54 AM

హామీలపై రాహుల్‌తో మాట్లాడ్తాం

22-06-2026 01:45 AM
  1. ఆయన అపాయింట్‌మెంట్ ఇప్పించండి
  2. కాంగ్రెస్ హామీలు, అమలు చేయని గ్యారెంటీలపై వినతిపత్రం ఇస్తాం 
  3. మహిళలకు నెలకు రూ.2,500 ఎప్పుడిస్తారు?
  4. ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసా ఏదీ?
  5. రూ. 4,000 నిరుద్యోగ భృతి ఏమాయె
  6. ఉచిత స్కూటీల కోసం కాలేజీ అమ్మాయిలు నిరీక్షణ
  7. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయండి. ఆయన అపా యింట్‌మెంట్‌ను ఇప్పించండి. మీరిచ్చిన.. చేసిన హామీలు.. నెరవేరని కాంగ్రెస్ గ్యార ంటీలపై రాహుల్‌గాంధీకి వినతి పత్రం ఇస్తాం. సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేయని గ్యారెంటీలను ఆయన దృష్టికి తీసుకెళ్తామని విజ్ఞప్తి చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు, గ్యారెంటీల ఆధా రంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం ఉంచారని తెలిపారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ ఇప్పించకపోతే అది తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహమేనన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి రాంచందర్ రావు బహిరంగలేఖతో కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, వ్యవసాయ కార్మికులు, పేద కుటుంబాలకు ఇచ్చిన పలు కీలక హామీలు ఇంకా నెరవేరని విషయా న్ని లేఖలో ఆయన స్పష్టం చేశారు. మీ హామీలు, గ్యారెంటీలు ఏమాయే! మహిళలు నెలకు రూ.2,500 అందుతుందని ఆశించారని, వారు ఈ ఆర్థిక సహాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని అన్నా రు.

అలాగే రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 లభిస్తుందని రైతులు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు కూడా నిరాశే ఎదురవుతోందని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థు లు, యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. విద్యా భరోసా పథకం కింద ఇస్తామన్న రూ.5 లక్షల సహాయం ఇంకా కార్యరూపం దాల్చలేదని రాంచందర్‌రావు పేర్కొన్నారు.

విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇబ్బందులు పడుతూనే ఉ న్నారని, నిరుద్యోగులు రాహుల్ గాంధీ హా మీ ఇచ్చిన నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, వృద్ధులు నెలకు రూ.4,000 పెన్షన్ కోసం వేచి చూస్తున్నారని, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆ ర్థిక సహాయాన్ని పెంచుతామని ఇచ్చిన హా మీ ఇప్పటికీ అమల్లోకి రాలేదని పేర్కొన్నా రు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కూడా తమ కు ఇస్తామన్న ఉచిత స్కూటీల కోసం ఇంకా వేచి చూస్తున్నారని, నిరుద్యోగ యువత జా బ్ క్యాలెండర్, ఉపాధి అవకాశాల కోసం ఎ దురుచూస్తూనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. 

ఘోరంగా విఫలమైన కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమ లు చేయడంలో ఘోరంగా విఫలమైందని, దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరుగుతోందని రాంచందర్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆందోళనలను, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా, వీలైనంత త్వరగా ఆయన తో తనకు అపాయింట్‌మెంట్ కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో, అ పాయింట్‌మెంట్ కల్పించడంలో విఫలమైతే, అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల కు చేసిన తీవ్ర ద్రోహాన్ని రుజువు చేస్తుందని లేఖలో రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

లేఖల వార్.. హీటెక్కిన రాజకీయం

తెలంగాణలో లేఖలతో పొలిటికల్ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మధ్య లేఖల వార్ ముదురుతోంది. పోటాపోటీగా లేఖాస్త్రాలను ప్రయోగించడం హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య లేఖల యుద్ధం ప్రకంపనాలు సృష్టిస్తోంది. రాష్ట్రప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే.

బీజేపీ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సీఎం రేంవత్‌కు రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో పెనుదుమారం లేపింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిష-న్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవలనే మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కూడా కిషన్‌రెడ్డికి ఉత్తరం రాశారు.

ఇలా లేఖలతో రేవంత్‌రెడ్డి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండడంతో.. తాజాగా రాష్ట్ర బీజేపీ సైతం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎంకు లేఖ రాస్తూ.. ముందు రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని రేవంత్‌రెడ్డిని కార్నర్ చేశారు. మొన్న కూడా మంత్రి సీతక్క కూడా వీబీజీ రాంజీ పథకం లోపాలపై కేంద్రానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ మధ్య ఉత్తరాల యుద్ధం భళే ఆసక్తిగా నడుస్తోంది.