7 May, 2026 | 1:59 AM

పంజాబ్‌లో వరుస పేలుళ్లు

07-05-2026 12:58 AM
  1. రెండు గంటల్లో జలంధర్, ఖాసాలో పేలుడు
  2. రంగంలోకి ఎన్‌ఐఏ
  3. జలంధర్ పేలుడు తమ పనే కేఎల్‌ఎఫ్ ప్రకటన

చండీగఢ్, మే 6: పంజాబ్‌లోని ఆర్మీయూనిట్‌లకు దగ్గరలో రెండు గంటల్లో రెండు పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. పేలుడులో పాక్ ప్రమేయంపై ఎన్‌ఐఏ ఆరా తీస్తుంది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జలంధర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించింది. కార్యాలయం బయట పార్క్ చేసిన ఒక స్కూటర్ పేలింది. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు.

పేలుడు శబ్ధం ఒక కిలోమీటర్ దూరం వరకు వినిపించింది. రెం డు గంటల తరువాత అమృత్‌సర్‌లో మరో పేలుడు చోటుచేసుకుంది. అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి దాడిచేసి అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. జలంధర్‌లో చోటుచేసుకున్న ఐఈడీ పేలుడు తమ పనేనని ఖలిస్థానీ లిబరేషన్ ఆర్మీ (కేఎల్‌ఎ) ప్రకటించింది.

ఫిబ్రవరిలో గురుదాస్‌పూర్ జిల్లాలో పంజాబ్ పోలీసుల చేతిలో హతమైన ఉగ్రవాది రంజీత్ సింగ్ మృతికి ప్రతీకారంగానే ఈ పేలుడు జరిపినట్లు ఓ ప్రకటనలో ఈ సంస్థ పేర్కొంది. ఖలి స్తాన్, ఐఎస్‌ఐ సంబంధాలపై దర్యాప్తు ము మ్మరమైంది. 

ప్రస్తుతం ఎన్‌ఐఏ ఈ దర్యాప్తును చేపట్టింది. ఖాసా సైనిక శిబిరం అంత ర్జాతీయ అటారీ సరిహద్దుకు సుమారు 15 కి.మీ. దూరంలో ఉండడం వల్ల ఈ ప్రాంతం అత్యంత సున్నితమైనదిగా భా విస్తారు. ఈ రెండు పేలుళ్ల మధ్య ఉన్న సారూప్యతల దృష్ట్యా, ఇవి ఒకే ముఠాపనేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

పేలుళ్ల వెనుక ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు పాక్ హస్తం దిశగా కూడా విచార ణ కొనసాగిస్తున్నారు. జలంధర్ సీసీ టీవీల్లో రికార్డు అయిన అనుమానితులను పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో భద్ర తా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.