9 March, 2026 | 11:48 PM

ఐటీఐ కళాశాలలో ఏటీసీ సెంటర్ ప్రారంభం

09-03-2026 09:46 PM

– యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఐటీఐ కళాశాలలో ఏటీసీ (ATC) సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సెంటర్‌లో యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం 15 రోజుల శిక్షణతో పాటు ఆరు రకాల షార్ట్ టర్మ్ కోర్సులను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ... ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు

ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ ఏటీసీ సెంటర్ ద్వారా సుమారు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడారి రామ్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి ముధం ప్రశాంత్, లచ్చిరెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.