15 August, 2026 | 1:51 AM

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి హామీ

15-08-2026 12:08 AM

ఉప్పల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఓల్ మల్లాపూర్లో నోమ ప్రాంతం నుంచి గాంధీ విగ్రహం వరకు గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. డ్రైనేజీ నీరు రోడ్లపై నిరంతరం పా రుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దోమల వ్యాప్తి తో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని ఓల్ మల్లాపూర్ వాసు లు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.

సమస్యను వివరంగా విన్న ఎమ్మెల్యే.. డ్రైనేజీ సమస్యకు సంబంధించిన ఫైలు ప్ర స్తుతం జోనల్ కమిషనర్ వద్ద ఉందని, సం బంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, హమాలీ శ్రీను, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ యాదవ్, ఉస్మాన్, శ్రీను, రాజేష్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.