20 May, 2026 | 3:22 AM

గొడవటంచలో ఆర్యవైశ్య అన్నదాన సత్రం

20-05-2026 12:58 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 19 (విజయక్రాంతి): చారిత్రక భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం లో భూపాలపల్లి జిల్లా, రేగొండ ఆర్య వైశ్యు ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 365 రోజుల నిత్య అన్నదాన కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమoలో ఎమ్మె ల్యే మాట్లాడుతూ నిత్య అన్నదానం ద్వారా దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎం తో ఉపశమనం కలుగుతుందని, అలాగే దే వాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. దే వాలయ అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.