8 August, 2026 | 4:19 PM

9న ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం

08-08-2026 02:57 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 9న సెంట్రల్ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మల్లూర్ వార్ చంద్రకాంత్ తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే వేడుకకు పట్టణ, పరిసర గ్రామాల ఆర్యవైశ్యులు హాజరై కార్యవర్గాన్ని ఆశీర్వదించాలని కోరారు.

కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మహాజన్, కార్యదర్శులు జనగం దినకర్, దెబ్బడి రాకేష్, సహా అధ్యక్షులు రాజు కౌటిక్ వార్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు బూసం రాజేశ్వర్, పడిగెల రాజేష్, జనగం దిలీప్, ఉపాధ్యక్షులు మనోజ్,  ముత్యపు రాధాకృష్ణ, నితీన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.