మొక్కలు నాటిన విద్యార్థులు
08-08-2026 04:01 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క విద్యార్థి తమ కుటుంబ సభ్యుల పేరట ఒక మొక్కను నాటాలని ఈనెల 8 న శనివారం ZPHS లింగాపూర్ పాఠశాల ఆవరణలో జరిగిన NGC ఆధ్వర్యంలో మొక్కలు నాటిన సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ZPHS లింగాపూర్ ఇంచార్జి హెడ్ మాస్టర్ K.భూమేశ్వర్ మాట్లాడారు. పాఠశాలకి చెందిన NGC ఇంచార్జి టీచర్లు వాల్గోట్ కిషన్, K. మహేష్, రాజేశ్వర్, PD ప్రభాకర్, రాజేందర్, రమేష్, శ్రీనివాస్ మరియు NGC విద్యార్థులు పాల్గొన్నారు.






