చిరు వ్యాపారి దుకాణంలో చోరీ
కొండపాక,ఆగష్టు 8:( విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని కొండపాక ఎక్స్ రోడ్డు వద్ద, బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ చిన్న వ్యాపారి దుకాణం లో చోరీ జరిగింది. టీ, సిగరెట్లు, బిస్కెట్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వడ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.
శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, రోజూలాగే ఉదయం దుకాణం తెరిచేందుకు రాగా, షాపు తాళం గడ్డపారతో పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. దుకాణంలో పరిశీలించగా ఒక గ్యాస్ సిలిండర్, 20 సిగరెట్ డబ్బాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అలాగే, గల్లా పెట్టెలో ఉన్న రూ 4000 నగదు కూడా అపహరణకు గురైందన్నారు. ఈ ఘటనపై బాధితుడు వెంటనే కుకునూరుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






