రజక సంఘం ఆధ్వర్యంలో బోనాలు
08-08-2026 04:05 PM
బెజ్జంకి, ఆగస్టు 8(విజయక్రాంతి): బెజ్జంకి రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం పోచమ్మ బోనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను సమర్పించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పట్నం అంజి, బాలయ్య, సాయిలు, శంకర్, మల్లయ్య, పరమేశ్, ఆంజనేయులు, ఎల్లయ్య, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.






