8 August, 2026 | 6:48 PM

ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్‌లో బోనాల ఉత్సవాలు

08-08-2026 03:53 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను కరీంనగర్ జ్యోతినగర్‌లోని ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి వేషధారణలో పోతురాజు వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విద్యార్థులు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా జ్యోతినగర్‌లోని పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.