27 July, 2026 | 3:02 PM

బాబోయ్... డీఏపీ కృత్రిమ కొరత!

27-07-2026 01:48 PM
  1. డిఏపి లింకులు పెట్టే అమ్ముతున్న.. ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యం.
  2. పట్టించుకోని ..తుంగతుర్తి వ్యవసాయ శాఖ అధికారులు.
  3. డీఏపీ ఉన్న.. షాపుల ఎదుట. స్టాక్ బోర్డులో రాసి లేవు, చర్యలు లేనట్లేనా.

తుంగతుర్తి(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ప్రతిష్టాత్మకంగా రైతుల ప్రయోజనాల దుష్ట ఒకపక్క రైతు సేవా సహకార సొసైటీలో, మరొక ప్రక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియా డి ఏ పి అమ్మకాలు(DAP sales) జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సహకార సొసైటీ తో పాటు, కొన్ని ఫెర్టిలైజర్ షాప్ లలో యూరియా ఆన్లైన్లో బుక్ చేసుకుని, రైతులు కష్టాలు పడుతూ కొనుగోలు చేసుకుంటున్నారు.

డిఏపి విషయానికి వస్తే, మండల కేంద్రంలో కేవలం రెండు, మూడు షాపుల్లో ఉన్నటువంటి డిఎపి స్టాకును పక్కకు పెట్టుకుని, కొంతమందికి డిఏపీ బస్తాతో నానో డబ్బాలు, గుళికలు కలిపి, లింకులు పెట్టి జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. తతంగం మొత్తం స్థానిక మండల వ్యవసాయ శాఖ అధికారికి, తెలిసినప్పటికీ, ముల్గే నక్క పై తాటి పండు పడ్డట్టు, చందంగా ప్రవర్తిస్తున్నాడు. డీఏపీ స్టాక్ పెట్టుకొని, రైతులకు ఇబ్బందులు గురిచేయుచున్న యాజమాన్యంపై, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా కలెక్టర్, ఫెర్టిలైజర్ యాజమాన్యంపై, కేసులు నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

డీఏపీ కొనాలంటే.. నానో యూరియా తీసుకోవాలి: తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఫెర్టిలైజర్స్ షాప్ యాజమాన్యం బిజెపి కొనాలంటే నానో ఏరియా తప్పకుండా కొనాల్సిందేనని, లేకపోతే ఇవ్వమని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన వేల్పుల కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, స్టాక్ ఉన్నప్పటికీ ఇవ్వని ఫెర్టిలైజర్ షాప్ యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలని కోరుతున్నాం.