చెత్త సేకరణ బండి రాక.. బహిరంగ ప్రదేశంలో చెత్త
20-05-2026 12:00 AM
ఘట్‌కేసర్, మే 19 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్ 6వ డివిజన్ లోని మోడీ బిల్డర్స్ ఫేస్ 1, ఫేస్ 2 లోని చెత్తను సేకరించి తీసుకువెళ్లే వాహనం రాకపోవడంతో కాలనీ వాసులు రోడ్ల పక్కన, ఓపెన్ ప్లాట్ లలో చెత్తను వేసున్నారని కావున ప్రతీ రోజు మోడీ కాలనీ లోకి చెత్త బండి వచ్చి లోపల ఉన్న నివాసాల చెత్తను తీసుకువెళ్లాలని ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ మంగళవారం ఘట్ కేసర్ సర్కిల్ శానిటేషన్ ఇన్ స్పెక్టర్ ను కలిసి తెలియజేశారు. మోడీ బిల్డర్స్ ఫేస్ 1, ఫేస్ 2 లోని చెత్తను తీసుకువెళ్లడానికి చెత్త బండిని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.






