జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సన్మానం
20-05-2026 12:00 AM
తలకొండపల్లి, మే19, (విజయక్రాంతి): తలకొండపల్లి మండలం వెల్జాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్య- పట్య జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు కొనియాడారు.
జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు స్పందన, చందు, శివను మంగళవారం వెల్జాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా దుస్తులు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ చదువుతూపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నసీమా సుల్తానా, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






