20 May, 2026 | 7:13 AM

మేడ్చల్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

20-05-2026 12:00 AM

అగ్ని ప్రమాదంలో 50 లక్షల మేర ఆస్తి నష్టం?

దట్టంగా పొగ కమ్మేయడంతో స్థానికుల భయాందోళన

మేడ్చల్ అర్బన్ మే 19 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పారిశ్రామిక వాడలో గల ఆగ్రో కెమికల్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పారిశ్రామికవాడలో ఆగ్రో కెమికల్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ ల సహాయంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది యత్నం చేస్తున్నారు.

అదేవిధంగా మేడ్చల్ స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుముట్టు వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఎవరిని అగ్ని ప్రమాద ఘటన వద్దకు పోనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.అగ్ని ప్రమాదంలో దట్టంగా పొగ కమ్మేయ్యడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.మేడ్చల్ పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో సుమారు 50 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు గోదాం యజమాని భార్గవ్ రామ్ వెల్లడించారు. పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం ఎలా చోటు చేసుకుందో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు మేడ్చల్ పోలీసులు వెల్లడించారు.