30 July, 2026 | 6:50 PM

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు

30-07-2026 05:43 PM

రామాయంపేట,(విజయక్రాంతి): 7వ వార్డు గోల్పర్తిలో బొగ్గుల చిన్న సిద్ధరాములు కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తక్షణ సాయంగా రూ.5,000 నగదు, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింతల యాదగిరి, తొంటావాలి యాదగిరి, ఎర్రం సత్యం, ఎర్రం యాదగిరి, సాదుల పరుశరాములు, పచ్చటి రాము, రొయ్యాల స్వామి, పాత నరేష్, కార్తీక్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.