11 May, 2026 | 9:52 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

శ్రీనాగులమ్మ జాతరకు ఏర్పాట్లు

27-02-2026 12:00 AM

మంగపేట, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో మార్చి 3 నుంచి 7 వరకు శ్రీ నాగులమ్మ మహా జాతర నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్ లు తెలిపారు. జాతర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు తెలిపారు. గురువారం శ్రీ నాగులమ్మ ఆలయంలో ఆలయ పూజారులు,  వడ్డెలతో కలిసి శ్రీ నాగులమ్మ మహా జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బాడిశ రామకృష్ణ స్వామీజీ మాట్లాడుతూ మహా జాతరలో భాగంగా మార్చి 3 న మండె మెలుగుట, 4 న యెర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ, గండోర్రె గుట్ట నుండి నాగులమ్మ తల్లి రాక అనంతరం గోదావరి పుణ్య స్నానాలు, 5 న పాలమాకు ఒర్రె నుండి కంకవనం ( వనదేవత ) రాజుపేటలో ఎదుర్కొలు, రాత్రి శ్రీ నాగులమ్మ తల్లి పగిడిద్ద రాజుల కళ్యాణం, తెల్లవారు జామున లోక కళ్యాణం కొరకు బాడిశ రామకృష్ణ స్వామీజీ (దేవర బాల ) అగ్ని గుండంలో నడవడం, 6 న అమ్మ వారికి మొక్కులు చెల్లించుంట, 7 న అమ్మ వార్లు తిరిగి వన ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెలు, పూజారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.