2 July, 2026 | 3:03 AM

పౌష్టిక అల్పాహార పథకం అమలుకు ఏర్పాట్లు వేగవంతం

02-07-2026 12:43 AM

నిజాంసాగర్లో కిచెన్ కోసం గోదాం పరిశీలన

నిజాంసాగర్, జూలై 1(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పౌష్టిక అల్పాహార పథకం  ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి.

ఈ క్రమంలో నిజాంసాగర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ   గోదాంను పథకానికి అవసరమైన వంట గదిగా వినియోగించే అవకాశాలను ఆర్డీవో రవీందర్ రెడ్డి,మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్  పరిశీలించారు. గోదాంలో అందుబాటులో ఉన్న స్థలం, వంటశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం సిద్ధం చేసే అవకాశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈ గోదాం పథకం అమలుకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు.