13 August, 2026 | 1:28 AM

స్టెమ్‌స్పార్క్‌లో లీడర్ లాంచ్ ఎన్నికలు

13-08-2026 12:00 AM

ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో విద్యార్థులకు మాక్ ఎన్నికలు లీడర్ లాంఛ్ కార్యకమా న్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బి. రామానుజం (అడిషనల్ డీసీపీ ఖమ్మం), స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు ఎన్నికల ను ప్రారంభించారు.

రామానుజం మాట్లాడుతూ.. రెజొనెన్స్ స్కూల్‌ను శ్రీనగర్‌లో స్థా పించి నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటు పడుతూ ఎం తో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు  ఎన్నికల పట్ల అవగాహనను కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.