నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
ఇల్లెందు, మే 14, (విజయక్రాంతి): ఇల్లెందు నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు టి పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇల్లెందు పట్టణ అధ్యక్షుడిగా బోళ్ల సూర్యం, ఇల్లెందు మండల అధ్యక్షుడిగా మండల రామ్ మహేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడిగా లక్కినేని శ్యామ్ మోహన్ లను నియమిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
తమ నియామకం కోసం కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఉమ్మడి జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఇతర నాయకులకు బోళ్ల సూర్యం, మండల రామ్ మహేష్, లక్కినేని శ్యామ్ మోహన్ లు కృతజ్ఞతలు తెలిపారు.






