27 June, 2026 | 3:46 AM

బీజేపీ ఓబీసీ, ఎస్సీ జిల్లా అధ్యక్షుల నియామకం

27-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఓబీసీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ నియమించింది. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ మొత్తం 35 మంది ఓబీసీ అధ్యక్షులను నియమించింది. హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజిస్తూ గోల్కొండ - గోషామహాల్ జిల్లాకు వెంకటేష్ గౌడ్, భాగ్యనగర్ - మలక్‌పేట్‌కు ప్రదీప్ చందు, మహాంకాళి - సికింద్రాబాద్‌కు వై.సురేష్, హైదరాబాద్ సెంట్రల్‌కు బంగారు ప్రకాశ్‌ను నియమించింది.

ఇక ఎస్సీ మోర్చాలను 32 మందిని నియమించింది. గోల్కొండ - గోషామహాల్ జిల్లాకు పూర్ణచందర్, భాగ్యనగర్- మలక్‌పేట్‌కు కౌడి సురేందర్, మహాంకాళి-సికింద్రాబాద్‌కు జి.నవీన్, హైదరాబాద్ సెంట్రల్‌కు జి.అంబేద్కర్‌ను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.