7 August, 2026 | 5:50 PM

బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత

07-08-2026 04:38 PM

బోధన్,(విజయ క్రాంతి): బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతనంగా నియమితులైన బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులకు శుక్రవారం నియామక పత్రాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (ఎంపీఆర్), బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను రైతులకు చేరవేయడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. 

కిసాన్ మోర్చా పార్టీకి కీలక విభాగమని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు రైతులతో మమేకమై పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. బోధన్ నియోజకవర్గంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వారి హక్కులు, సంక్షేమం కోసం కిసాన్ మోర్చా నాయకులు నిరంతరం పనిచేయాలని నాయకులు సూచించారు.