గీతన్నల చైతన్య యాత్రకు స్వాగతం పలికిన ప్రజా సంఘాల నాయకులు
11-08-2026 06:41 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రకు కొమరవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, స్థానిక గౌడ సంఘం నాయకులు స్వాగతం పలికారు. స్థానికంగా ఉన్న గీతా కార్మికుల సమస్యలను బస్సు యాత్ర బృందానికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తేలు ఇస్తారి, తాడూరి రవీందర్, గౌడ సంఘం నాయకులు దొడ్ల విష్ణుమూర్తి, దొమ్మాట బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.






