వైద్య ఉద్యోగులు సమయపాలన పాటించాలి
11-08-2026 06:21 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ అన్నారు. మంగళవారం సాయంకాలం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటిస్తూ.. గ్రామాల్లో వ్యాధుల బారిన పడే వారికి వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు. ఆయనతోపాటు వైద్య సిబ్బంది, డాక్టర్ పూజిత పాల్గొన్నారు.






