26 May, 2026 | 4:44 AM

ప్రజవాణిలో 10దరఖాస్తులు

26-05-2026 12:39 AM

వెల్లడించిన చేవెళ్ళ ఆర్‌డిఓ పార్థసారథి

చేవెళ్ళ మే 25(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, చేవెళ్ల డివిజన్ పరిధిలో సోమవారం ‘ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పార్థసారథి ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన కార్యక్రమం మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు హాజరు అయ్యారని ఆర్ డిఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల వివరాల ప్రకారం విద్యుత్ శాఖలో ఒకటి, ఆర్ & బి విభాగం ఒకటి, రెవెన్యూ శాఖలో ఆరు పిర్యాదులు రాగ పెన్షన్లకు సంబంధించి రెండు పిర్యాదులు వచ్చాయన్నారు.

కార్యక్రమంలో ప్రజలనుండి మొత్తం పది వినతులు రాగ సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పారు. పిర్యాదుదారునికి వ్రాతపురకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పురోగతిని ఆర్ డిఓ సమీక్షించారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.