బుర్రిపోషవ్వ తల్లికి మొక్కులు చెల్లించిన ఆదివాసి కోలవార్ తెగ ప్రజలు
22-06-2026 03:53 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో సోమవారం బుర్రి పోషవతల్లికి ఆదివాసి,కోలేవార్ తెగ ప్రజలు మొక్కులు చెల్లించారు.తొలకరి జల్లులు పడడంతో ఆచారం సంప్రదాయం లో భాగంగా మొదటి మోక్కుగా బుర్రి పోషవ్వ తల్లిని మొక్కుకొని పెద్దలకు చిన్నపిల్లలకు ఎడ్లకు, ఆవులకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని ఈ సంవత్సరం కూడ వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు, మంచిగా పండాలని మొక్కలు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి కోలేవార్ సేవా సంఘం నాయకులు, గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.






