22 June, 2026 | 4:52 PM

ఉట్నూరులో కురిసిన వర్షం.. ఉపశమనం పొందిన జనం

22-06-2026 03:50 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై న 15 రోజుల తర్వాత సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో ఉట్నూర్ మండల కేంద్రంలో వర్షం కురిసింది. వేసవి కాలం ముగిసి.. వర్షాకాలం ప్రారంభమైన తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కురిసిన వర్షం  కొంతమేర ఉపశమనం కల్పించింది. ఉట్నూర్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈదురు గాలులతో  వర్షం కురవడంతో  రైతులు సైతం  ఆనందం వ్యక్తం చేశారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి మండలాలలోని  పలు గ్రామాల్లో వర్షం జల్లులు పడ్డాయి.. వర్షాలు కురవాలని ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు.