22 June, 2026 | 4:49 PM

క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

22-06-2026 03:56 PM

తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సోని బాలదేవి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గిరిజన విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సోని బాలదేవి అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా  జిల్లాకు వచ్చిన ఆమె జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలను సందర్శించారు. 

కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం అనంతరం పాఠశాలకు చేరుకున్న డా. సోని బాలదేవి, విద్యార్థి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సాధించిన పతకాలు, ట్రోఫీలను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గిరిజన బాలికలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పొందితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. క్రీడల ద్వారా ఆర్థికంగా ఎదిగి తమ తల్లిదండ్రులకు అండగా నిలవాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం పాఠశాలలోని వసతులు, శిక్షణ విధానాన్ని పరిశీలించిన డా. సోని బాలదేవి అధికారులకు పలు సూచనలు చేశారు.