రైతుపై కాంగ్రెస్ చిన్న చూపు చూస్తోంది
ధాన్యం కొనుగోలు చేసిన చెల్లింపులు లేవు
మస్కాపూర్ రైతుల నిరసన
ఖానాపూర్,(విజయక్రాంతి): రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటికీ తమ ఖాతాలో దాన్యం డబ్బులు పడలేదని ప్రభుత్వం తాత్సారం చేస్తుందని పేర్కొంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామ రైతులు సోమవారం మెట్పల్లి ఖానాపూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ రోజులు గడుస్తున్నా తమకు ధాన్యం డబ్బులు రాలేదని వారు వెంటనే ప్రభుత్వం రైతులకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసిల్దార్ సుజాత రెడ్డి, ఎస్సై రాహుల్ గైక్వైడ్ నిరసన స్థలానికి వెళ్లి రైతులను సముదాయించారు మూడు నాలుగు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడేలా పై అధికారులతో మాట్లాడుతానని తాసిల్దారు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.






