24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత

21-04-2026 05:57 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుషాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్ 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో బీజెడ్ సి, ఎంబిజెడ్ సి, ఎన్ డి జెడ్ సి, బీటీ బీసీ, బీజీసి, బీసీ బీసీ, ఎంబిసీసీఎస్ గ్రూపులలో సీట్లు ఉన్నాయని తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండవ సంవత్సర చదివిన అర్హత గల విద్యార్థినీలు మే 7వ తేదీలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఎస్ఎస్సి మెమో, టిసి, ఇంటర్ మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు జిరాక్స్, మూడు కలర్ ఫొటోలతో మహిళా డిగ్రీ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 90000 01667, 99499 87216 మొబైల్ నంబర్లను సంప్రదించాలన్నారు.