3 July, 2026 | 9:39 PM

Breaking News

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •  

ప్రజావాణికి 111 దరఖాస్తులు

03-11-2025 08:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను అధికారులకు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు  విక్టర్, మదన్ మోహన్, సీఈవో చందర్, డిప్యూటీ కలెక్టర్  రవితేజ,  ఏఓ  పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖాధికారులకు అప్పగిస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆన్నారు. 

ఈ సందర్భంగా అదనపు రెవెన్యూ కలెక్టర్  విక్టర్ అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ... ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తహసిల్దార్లు, శాఖాధికారులు ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఆయాశాఖలకు సంబంధించి ప్రజావాణి దరఖాస్తుల పై ఆరా తీస్తూ  దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కి 111 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.