3 July, 2026 | 10:42 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం

03-11-2025 08:05 PM

భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్ర బీసీ సాధన సమితి పిలుపు మేరకు సోమవారం భద్రాచలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నేతృత్వంలో బీసీ నాయకులు, కార్యకర్తలు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్టకి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బొలిశెట్టి రంగారావు, ప్రధాన కార్యదర్శి బండారు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అనుగోజు నరసింహ చారి, సహాయ కార్యదర్శి మేకల మల్లు బాబు యాదవ్, సహకోశాధికారి కోపనాతి శాంతారావు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అనుమల్ల గంగాధర్, గాళ్ల తెలకుల సంఘం అధ్యక్షుడు కొమ్మనాపల్లి ఆదినారాయణ, దేవాంగుల సంఘం అధ్యక్షుడు ఏ. కుల రామచంద్రరావు, ఎస్సీ సంఘం నాయకులు ముద్దా పిచ్చయ్య, కోటా కిషోర్, బోక్క రాంబాబు, దాసరి శేఖర్, ఆదివాసి సంఘం నాయకులు రవ్వ భద్రమ్మ, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.