18 April, 2026 | 5:30 PM

మినీ గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

18-04-2026 03:57 PM

ప్రాంతీయ సమన్వయ కర్త పి.రత్నకుమారి

మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ గిరిజన మినీ గురుకులంలో (బాలికల) మరిపెడ, కొత్తగూడ, గంగారాం ఉమ్మడి మండల పరిధిలోని గోవిందాపూర్ పరిధి ప్రాంతం వారికి 2026 27విద్యా సంవత్సరమునకు 1 తరగతి (ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు 6 సంవత్సరాల  వయస్సు కలిగిన బాలికలకు ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్ సి ఓ రత్నకుమారి తెలిపారు. మరిపెడ మినీ గురుకులం 1 తరగతిలో 30 సీట్లు,  బ్యాక్లాగ్  వేకెన్సీలు  2వ తరగతిలో 4 సీట్లు , 5వ తరగతిలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయని, గోవిందాపూర్ మినీ గురుకులంలో 1వ తరగతిలో 30 సీట్లు, బ్యాక్లాగ్  వేకెన్సీలు 5 వతరగతిలో  20  సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

మినీ గురుకులం ఉన్న మండల పరిధిలోని విద్యార్థులకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను స్వీకరించిన తర్వాత ఐటిడిఏ ఎటురునాగారం పిఓ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులకు  ఉచిత భోజనం వసతి, నోటు పుస్తకాలు, బెడ్ షీట్స్, దుస్తులు, టెక్స్ట్ బుక్స్  తదితర అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించబడునని తెలిపారు. తేది.19.04.2026 నుండి  05.05.2025 లోపు మండల ఇతర మండలాలకు చెందిన వారు నేరుగా ఆయా మినీగురుకులంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు మినీ గురుకులం హెడ్మాస్టర్లను నేరుగా సంప్రదించాలని కోరారు.