మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి
18-04-2026 03:55 PM
తుంగతుర్తి,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల హెడ్ కుక్ షేక్ మదర్ బి, హెచ్/ యాకుబ్ అలి ను తుంగతుర్తి ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి, చెప్పుకోలేని భాషలో తిట్టి స్కూల్ నుంచి పంపించడంతో, మరుసటి రోజు అనగా శనివారం 18.4.2026 నాడు తిరిగి స్కూలుకు వెళ్లగా, స్కూల్లో కి రాకుండా ఎండలో 6 గంటల పాటు నిలబెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో సీరియస్ ఉండడంతో అక్కడి నుండి 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటనపై వెంటనే కలెక్టర్ స్పందించి, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందో, విచారణ జరిపించి, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని హెడ్కుక్ మదర్ బి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.






