25 August, 2026 | 4:42 AM

ఇద్దరు విద్యావేత్తలకు ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులు

25-08-2026 12:00 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 24 (విజయక్రాంతి): విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న అనురాగ్ యూనివర్సిటీకి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. హైదరాబాద్లోని మే డన్ ఎక్స్పో సెంటర్లో  నిర్వహించిన భారత్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రదానం చేసిన డాక్టర్  ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవారడ్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు అనురాగ్ యూనివర్సిటీకి చె ందిన ఇద్దరు విద్యావేత్తలు ఎంపికై అవార్డు లు అందుకున్నారు.

అనురాగ్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్ మహీపతి శ్రీనివాసరావుకు ఎక్సెంప్లరీ లీడర్ షిప్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్  అవార్డు లభించింది. ఉన్నత విద్యా రంగంలో నాయకత్వం, విద్యార్థుల అభివృద్ధి, విద్యా నాణ్యత, సంస్థాగత పురోగతికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందించారు. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ అసో సియేట్ డైరెక్టర్  సోషల్ లెర్నింగ్ డాక్టర్ సి. మల్లేశకు ఎమర్జిం గ్ లీడర్ ఇన్ హ య్యర్  ఎడ్యుకేష న్ అవార్డు లభించింది.

విద్యా ర్థుల్లో జీవిత నైపుణ్యాలు, సామాజిక అవగాహన, అనుభవాత్మక అభ్యాసం, 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది. ఈ రెండు అవార్డులు అనురాగ్ యూనివర్సిటీ విద్యా నాయకత్వం, నూతన ఆలోచనలు విద్యార్థి-కేంద్రిత అభ్యాసానికి అందిస్తున్న ప్రాధాన్య తకు ప్రతీకగా నిలిచాయి. ఈసందర్భంగా అ నురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం, అ ధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు మహీపతి శ్రీనివాసరావు, డాక్టర్ సి. మల్లేశలను అభినందించారు.