25 August, 2026 | 9:32 PM

ఉద్యోగుల మహాధర్నాకు అనుమతివ్వాలి

25-08-2026 12:00 AM

అదనపు కలెక్టర్, జాయింట్ సీపీలకు వినతిపత్రం అందజేత  

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 24: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 27 తలపెట్టనున్న  మహా ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) కిరణ్మయి, ఫ్యూచర్ సిటీ జాయింట్ కమిషనర్ చందనా దీప్తిలకు టీజీజేఏసీ చైర్మన్ ఊటు యశ్వంత్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఊటు యశ్వంత్ మాట్లాడుతూ... ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉద్యోగ సంఘాల అభిష్టం మేరకు  మహా ధర్నా కార్యక్రమాన్ని శాంతి యుతంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. జిల్లాలో ఉన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని.. ఉద్యోగుల సమస్య పరిష్కారానికై ఈ నెల 27న  కొంగర కాలన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు, నాయకులు శ్రీనివాసరావు , రంగయ్య , ఆనంద్ సింగ్, గోపాల్ నాయక్, వాణి శ్రీదేవి, అన్నపూర్ణ, తేజ, గౌస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.