మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా గంగాపురి 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం
మంథని,(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంథని పట్టణంలోని గంగాపురిలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మంథని పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు వోల్టేజీ సమస్యలకు పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.
మంథని అభివృద్ధిలో మరో ముందడుగు
మంత్రి శ్రీధర్ బాబు చొరవతో మంథని ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారని అధికారులు తెలిపారు. నూతన సబ్‌స్టేషన్‌తో మంథని పట్టణం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆపరేషన్ పర్యవేక్షక ఇంజనీర్ వి. గంగాధర్, మంథని ఆపరేషన్ డి.ఇ. వి. ప్రభాకర్, పెద్దపల్లి యు.జి.సి.బి & కన్స్ట్రక్షన్ డి.ఇ. కె. శ్రీనివాస్ రెడ్డి, కన్స్ట్రక్షన్ ఎ.డి.ఇ. యం. సత్యనారాయణ, మంథని కన్స్ట్రక్షన్ ఎ.ఇ.ఇ. బి. రాజ్, కరీంనగర్ సివిల్ ఇ.ఇ. కె. శ్రీనివాస్, పెద్దపల్లి సివిల్ ఎ.డి.ఇ. ఎ. జయ భారతి, ఆపరేషన్ ఎ.డి.ఇ. వి. వెంకటనారాయణ, ఆపరేషన్ ఎ.ఇ. కె. సాయి తదితరులు పాల్గొన్నారు.






