12 July, 2026 | 3:50 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

ఇసుక లారీల బీభత్సానికి మరో ప్రాణం బలి

12-02-2026 12:00 AM

(దుమ్ముగూడెం) చర్ల, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): మండలంలోని ములకాపాడు ప్రధాన రహదారిపై లారీల బీభత్సానికి మరో మహిళ ప్రాణం బలైంది, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు  చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ గొల్లగూడెం గ్రామానికి చెందిన కొట్టెం కమల (45) వ్యక్తిగత పనుల నిమిత్తం భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యంలో ములకపాడు ప్రధాన రహదారిపై లారీ ఢీకొని కమల మృతి చెందారు.

ఈ సంఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై లారీలకు హద్దు అదుపు లేకుండా పోతున్నాయని ఇంకెంత మంది ప్రాణాలు పోతే గాని ఈ ప్రభుత్వానికి చలనం రాదని మండిపడుతున్నారు,ఈ ఇసుక లారీల వలన ఇప్పటికి అనేక ప్రమాదాలు జరిగినా నివారణ చర్యలు అంతంత మాత్రం గానే ఉన్నాయి ప్రజలు మండిపడుతున్నారు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.