యానిమల్ కేర్ సెంటర్ తనిఖీ
కుత్బుల్లాపూర్, ఆగష్టు 21(విజయక్రాం తి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఐఏఎస్, కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్, అదనపు కమిషనర్ , ఇంజినీరింగ్ వెటర్నరీ శాఖల అధికారులు కలిసి గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహదేవపురం యానిమల్ కేర్ సెంటర్ను శుక్రవారం సందర్శించా రు. అనంతరం అక్కడి సదుపాయాలు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా సృజన మాట్లాడుతూ యా నిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచి, మరింత బలోపేతం చేయాలని కమిషనర్, అధికారులను ఆదేశించారు. తద్వారా సీఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కుక్కలకు అవసరమైన సేవలు అందించేలా సదుపాయాలను విస్తరించాలని సూ చించారు. కేంద్రంలో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని పెట్ థీమ్ పార్క్గా అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలించారు.
ఇందులో పెట్ హాస్టల్స్, కేఫెటీరియా, పెట్ స్పోరట్స్, ఇతర కార్యకలాపాలకు ప్రత్యేక స ్థలాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. యానిమల్ కేర్ సెంటర్కు సరైన రహదారి అనుసంధానం కల్పించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చే సుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని క మిషనర్, అధికారులకు ఆదేశాలు జారీ చే శారు. ఈ ప్రతిపాదిత అభివృద్ధి ద్వారా జం తు సంరక్షణ సదుపాయాలను బలోపేతం చేస్తూ మరింత పెట్-ఫ్రెండ్లీ సైబరాబాద్ను తీర్చిదిద్దవచ్చని తెలిపారు.






