20-02-2026 01:10:55 PM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : మల్కాజ్ గిరి కార్పొరేషన్, ఉప్పల్ జోన్, ఘట్ కేసర్ సర్కిల్ 108 అత్యవసర అంబులెన్స్ వాహనాన్ని పోచారం సింగపూర్ టౌన్ షిప్ లో జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలో అత్యవసర పరికరాలను పరిశీలించారు. సిబ్బందికి అత్యవసర సమయంలో తొందరగా రెస్పాండ్ కావాలని సూచించారు. ఘట్ కేసర్ సర్కిల్ ప్రాంత ప్రజలు అత్యవసర సమయంలో 108 వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది పైలెట్ భద్రు నాయక్, పవన్, టెక్నీషియన్ రమేష్ ధరావత్ పాల్గొన్నారు.