12 July, 2026 | 3:47 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

అంబులెన్స్ సేవలు తనిఖీ

26-12-2025 07:42 PM

​నంగునూరు: నంగునూరు మండల కేంద్రంలో 108 అంబులెన్స్ సేవలను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సంపత్, జిల్లా కోఆర్డినేటర్ హరి రామకృష్ణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని రికార్డులను, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాల్లో గర్భిణీలకు, ప్రమాద బాధితులకు తక్షణమే స్పందించి ప్రాణాపాయం నుంచి తప్పించేలా తగు సూచలను సిబ్బందికి ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ఈఎమ్‌టి రమేష్, పైలట్ యాదయ్య తదితరులు ఉన్నారు.