చెన్ను లవ్‌స్టోరీ స్వరాలు
24-05-2026 01:42 AM
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘చెన్నై లవ్‌స్టోరీ’. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు. సాయిరాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ నెల 25న రెండోగీతం ‘వదలనే..’ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాట ఎమోషనల్ లవ్ సాంగ్‌గా ఉండబోతున్న ట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డేనియల్; ఎడిటర్: సంతోష్; ఆర్ట్: భాస్కర్ ముదావత్.






