6 May, 2026 | 1:53 AM

అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

06-05-2026 12:33 AM

మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.