అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
11-04-2026 02:06 AM
నిజాంసాగర్ ఏప్రిల్ 10 (విజయ క్రాంతి ): ఏప్రిల్ 14వ తేదీన నిర్వహించే అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం నాడు నిజాంసాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామంలోని అంబేద్కర్ సంఘ భవనంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్ గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి కలర్స్, పూలమాలలతో విగ్రహ పరిసరలో అలంకరణ ,చేసి ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గైని రవి , విఠల్,గణేష్,జగన్,సాయిలు, సునీల్ కుమార్,పుల్లయ్య,నగేష్,శంకర్,సాయిలు పాల్గొన్నారు.




