సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం
ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): సామాజిక న్యాయం, సమానత్వం సాధన కోసమే అంబేద్కర్(Ambedkar Jayanti) జీవితాంతం ఆరాటపడిన మహనీయుడని నాగర్ కర్నూల్(Nagarkurnool) ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.






